Image

5 ఫిబ్రవరి 2018

శరశర్మ బ్రదుకుబాట

సింహావలోకనం చేసుకోగా సాధించినది అనితరసాధారణమైనది అనే అహంకారం ఏ కోశానా లేదు. కానీ వ్యర్థపు బ్రదుకు బ్రదకలేదనే నమ్మకం పుష్కలంగా ఉన్నది. భావిజీవితంలో కూడా అదే నమ్మకమూ, తృప్తి కలగాలని – ఇతోఽధికంగా కలగాలని – ఆకాంక్ష. భగవంతుడు సర్వదా సర్వధా అనుగ్రహిస్తాడనే విశ్వాసం మరింత నిండుగా ఉన్నది.

ఎందరో శరశర్మను ప్రేమించారు. మానవతామూర్తి డా.జి.వి. చలపతిగారు, మన్నీలతాత, బ్రహ్మచారి పార్థసారథిగారు, న్యాయమూర్తి శ్రీ పమిడిఘంటం కోదండరామయ్యగారు, పుణ్యశ్లోకులు శ్రీ రమణయ్యరాజా గారు, పూజ్యగురువర్యులు శ్రీ కందుకూరి శివానందమూర్తి మహితాత్ములు, పరిమి ఆంజనేయశర్మగారు, గట్టు నారాయణ గురూజీ – ఇంకా ఎందరో! ఈ మహాత్ములతో గడిపే ప్రతిక్షణం ఒక ఆనందతరంగఖేల.

శ్రీ శృంగేరీ శారదాపీఠాధిపతులు మహాసన్నిధానం జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వాములు, సన్నిధానం శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వాములవారి పాదపద్మాలు హృదయపద్మంలో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటాయి.

సంతానం – శాఖోపశాఖలు

జీవనయానం

1941
జననంవృష ఆషాఢ అమావాస్య - 23 జూలై
పుట్టిన ఊరుగొల్లపల్లి, నూజివీడు తాలూకా, కృష్ణాజిల్లా - 521 111
తల్లిదండ్రులుకీర్తిశేషులు శ్రీమతి దుర్గాంబ, శ్రీ నరసయ్య
తోబుట్టువులుఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు
1960 ~ 1964

భాషాప్రవీణ


    భాషాప్రవీణలో మొదటి స్థానానికి గాను ఆంధ్రవిశ్వకళా పరిషత్తు వారి దువ్వూరి వీరభద్రయ్య స్మారక పురస్కారం - 1960


ఉద్యోగము


  1. ఉన్నత పాఠశాలలలో తెలుగు పండితునిగా - 1960-1965

  2. 1960 జూన్ లో. రాజమండ్రి శ్రీ గౌతమీ విద్యాపీఠం ప్రాచ్యఉన్నతపాఠశాలలో.

  3. రెండవ మెట్టు విశాఖపట్టణంలోని మిసెస్ ఎ.వి.యన్. కళాశాల ఉన్నత పాఠ శాల.

  4. మూడవ అడుగు ఏలూరులోని కొండ పార్వతీదేవి థియోసాఫికల్ హయ్యర్ సెకండరీ పాఠశాల.

  5. నాలుగవచోటు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నత పాఠశాల.


వివాహం


    ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరి. - 26.5.1962
    (చెఱుకుపల్లివారి ఆడబడుచు)


పురస్కారాలు


    భాషాప్రవీణ పరీక్షకు ఆంధ్రరవిశ్వవిద్యాలయం వారి దువ్వూరి వీరభద్రయ్య స్మారక పురస్కారం - 1960

1965-1969

అధ్యయనం


    ఎం.ఏ. అధ్యయనం - 1965-1967

    ఆ సమయంలో కూడా ఒక సంవత్సరం హైదరాబాదులోని న్యూ ఈవెనింగ్ హైస్కూలులో రాత్రిపూట ఉద్యోగం. అంటే మొత్తం ఆరు సంవత్సరాలు ఉన్నత పాఠశాలలలో తెలుగు పండితునిగా బోధన


ఉద్యోగము


  1. భాగ్యనగరంలోని ఆంధ్ర సారస్వత పరిషత్‌ ప్రాచ్యకళాశాల అధ్యాపకత్వం - 1967-1968

  2. అనంతపురం శ్రీవేంకటేశ్వర స్నాతకోత్తర విద్యాకేంద్రం లో అధ్యాపకత్వం - 1968 జూలై 22

రచనలు


  1. దండి దశకుమారచరితము – అనువాదం – వ్యాఖ్యానం. - 1966

  2. బాణుని హర్షచరిత్రం – అనువాదం – వ్యాఖ్యానం - 1967

  3. సరళతమవిధి – బ్రహ్మదత్తజిజ్ఞాసు హిందీ రచనకు అనువాదం - 1968

పురస్కారాలు


    ఎం.ఏ. పరీక్షలో ప్రథమస్థానం సాధించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి గురజాడ అప్పారావు స్మారక స్వర్ణపతకం - 1967


1975 ~ 1979

సర్వోన్నతశ్రేణితోపాటు స్వర్ణపతకంతో, పి.హెచ్.డి


    కవిత్రయ మహాభారతము - ఆంధ్రమహాభారతములో ధ్వని సిద్ధాంత సమన్వయము.

    శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం - 1975


రచనలు


    భారతధ్వనిదర్శనము – సిద్ధాంతగ్రంథం – రెండుమార్లు ముద్రితం 1979 600 పేజీలు


1980 ~ 1984

రచనలు


  1. లఘుకౌముది మార్గదర్శిని – సంస్కృత వ్యాకరణవ్యాఖ్యానం 1981 400 పేజీలు

  2. భట్టారకభారతభారతి – నన్నయ భారతంపై సాహిత్యవ్యాసాలు 1982 80 పేజీలు

1985 ~ 1989

ఉద్యోగము


అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో


  1. ఆచార్యపదవి - 1985 ఫిబ్రవరి 11

  2. శాఖాధ్యక్షుడుగా - 1987-89 2 సంవత్సరాలు

  3. అకడమిక్ సెనేట్ సభ్యుడుగా - 1989 మే నుండి 3 సంవత్సరాలు

రచనలు


  1. మహాభారతం – విరాటపర్వం – నీలకంఠీయవ్యాఖ్యాసహితం రెండుమార్లు ముద్రితం 1985 400 పేజీలు

  2. వశిష్ఠుడు – శ్రీనివాసబాలభారతి – తి.తి.దే. 1985 30 పేజీలు

పురస్కారాలు


    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి ఉత్తమోపాధ్యాయ పురస్కారం - 1986


1990 ~ 1994

ఉద్యోగము


  1. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉన్నతస్థాయి సంఘ సభ్యత్వం 1992 ప్రాంతంలో

  2. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యయన సంఘాధ్యక్షుడుగా – 1993 జూలై నుండి 3 సంవత్సరాలు

రచనలు


  1. విదురనీతి – నాలుగుమార్లు ముద్రితం 1990 – 200 పేజీలు

  2. అంతరంగనివేదనము – పద్యాలు 1994 30 పేజీలు

  3. సహృదయభావలహరి – సాహిత్యవ్యాసాలు – 1994 – 100 పేజీలు

1995 ~ 1999

ఉద్యోగము


అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో


  1. వినయాధ్యక్షుడుగా (డీన్). 1997 జూన్ నుండి 3 సంవత్సరాలు

  2. మరొకసారి శాఖాధ్యక్షుడుగా 1998 మేనుండి 3 సంవత్సరాలుు

రచనలు


  1. సనత్సుజాతీయ సౌరభం – 1996 – 60 పేజీలు

  2. భాగవతనవనీతము – 1996 – 100 పేజీలు

  3. సూక్తిచంద్రిక – రేడియో ప్రసంగాలు – రెండుమార్లు ముద్రితం – 1997 – 60 పేజీలు

  4. యక్షప్రశ్నలు - నాలుగుమార్లు ముద్రితం – 1998 – 60 పేజీలు

  5. వరాహపురాణం – మొదటి భాగం – 1998 – 200 పేజీలు

2000 ~ 2004

ఉద్యోగము


    అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రిటైర్ కాబోయే నాటికి ఈ సంస్థలో ఉద్యోగం చేసిన సంవత్సరాలు 33 - జూలై 2001


రచనలు


  1. శివానందలహరి హంస – 2000 – 136 పేజీలు

  2. మహాభారతము – శాంతిపర్వము - నీలకంఠీయవ్యాఖ్యాసహితం – రెండుభాగాలు 2001, 1600 పేజీలు

  3. సనత్సుజాతీయదీపిక – 2002 – 80 పేజీలు

  4. ఆర్షభావనా చంద్రికలు – రెండుమార్లు ముద్రితం - 2003 – 120 పేజీలు

  5. అనుగీతాకరదీపిక – 2004 – 100 పేజీలు

  6. శ్రీమహాభారతం – కర్ణశల్యసౌప్తికస్త్రీపర్వములు – వచనం – 2004 – 300 పేజీలు


పురస్కారాలు


  1. అనంతపురం లిటిల్‌ఫ్లవర్‌ విద్యాపీఠం వారి కవిత్వవేది నారాయణరావు స్మారక పురస్కారం - 2001

  2. శ్రీ పేరాల భరతశర్మ స్మారక పురస్కారం - విశాఖపట్టణం - 2003

  3. శ్రీ భూతపురి సుబ్రహ్మణ్యశర్మ స్మారక పురస్కారం - కడప - 2003

  4. సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్టువారి శ్రీ శివానంద ఎమినెంట్‌ సిటిజన్‌ పురస్కారం - హైదరాబాదు - 2003

  5. గుంటూరు - శ్రీనాథపీఠం వారి చెరువు లక్ష్మీనరసింహం, పార్వతమ్మల సాహితీ పురస్కారం - 2004

2005 ~ 2009

రచనలు


  1. శ్రీ గురుగీత – తాత్పర్య రచన – 2005 – 30 పేజీలు

  2. కవిత్రయభారతజ్యోత్స్న – కవిత్రయ మహాభారతంలోని 108 పద్యాలకు వ్యాఖ్యానం 2005 – 312 పేజీలు

  3. కవిత్రయమహాభారతం – అనుశాసనపర్వం – తి.తి.దే. -2008 – 800 పేజీలు

  4. ఆర్షభావనావీచికలు – సాహిత్యవ్యాసాలు – 2008 – 100 పేజీలు

  5. మహాభారతము – ఆణిముత్యాలు – 2008 – 60 పేజీలు

  6. ఉపనిషత్తులు – శ్రీగట్టునారాయణగురూజీ గారి ఆంగ్లరచనకు అనువాదం. 2008 – 40 పేజీలు

  7. కదంబవనం – వ్యాసాలు – కవిత్వం – 2009 – 80 పేజీలు

  8. వ్యాసభారతవరివస్య – మహాభారతంపై వ్యాసాలు – 2009 – 100 పేజీలు

  9. ప్రశ్నోపనిషత్సౌరభం – 2009 – 56 పేజీలు

  10. శ్రీ బాలసాయిబాబా బోధనలపై 62 శ్లోకాల రచన – 2009


పురస్కారాలు


  1. ఏలూరు - శ్రీ గుప్తా ఫౌండేషన్‌ పురస్కారం - 2005

  2. శ్రీకాకుళం - 2006 మహతి విశిష్ట సాహితీ పురస్కారం - మే - 2006

  3. అనకాపల్లి -స్వర్గీయ అన్నావజ్ఝల వెంకట శివరామకృష్ణమూర్తి స్మారక పురస్కారం - అక్టోబరు 2006

  4. మంత్రాలయం - శ్రీ రాఘవేంద్రమఠ మహాస్వాములు అనుగ్రహించిన సుజయశ్రీ ప్రత్యేక పురస్కారం - 22-1-2007

  5. తణుకు - శ్రీ నన్నయ భట్టారక పీఠము - డా. జి.ఎస్‌.వి. ప్రసాద్‌ సాహితీ పురస్కారం - 21-03- 2007

  6. శ్రీ లక్ష్మీసర్వారాయ సాహితీ పురస్కారం - కపిలేశ్వరపురం - 02-05-2007

  7. ఆరేపల్లి వేదశాస్త్ర పరిషత్తు సత్కారం - నూజివీడు - 2007

  8. డా|| పులికంటి కృష్ణారెడ్డి సాహితీ సత్కృతి పురస్కారం - తిరుపతి - 27-01-2008

  9. విజయభావన సర్వధారి ఉగాది పురస్కారం - విజయనగరం - 07-04-2008

  10. మధురభారతి శ్రీ మల్లాప్రగడ శ్రీరంగరాయ స్మారక పురస్కారం - విజయవాడ - 27-04-2008

2010 ~ 2014

రచనలు


  1. శ్రీదుర్గాదేవీసమర్చన – 2010 – 80 పేజీలు

  2. జగద్గురు శ్రీపదార్చన – 2013 - 76 - పేజీలు

  3. నహుషయక్షప్రశ్నావళి – 2014 – 247 - పేజీలు

  4. మహాత్ములు – మణిదీపాలు (బ్రహ్మశ్రీ పరిమి ఆంజనేయశర్మగారి స్మారకంగా రచించిన వ్యాసాలు) 2014 – 102 - పేజీలు

పురస్కారాలు


  1. శ్రీ శృంగేరి శివగంగా శ్రీ శారదాపీఠము, హైదరాబాదు శాఖవారి సమ్మానము - 28 - 11- 2009

  2. రాజమహేంద్రి కళాగౌతమి వారి సమ్మానము - 09-05 - 2010

  3. సువర్ణ కంకణ ప్రదానము - రాజమహేంద్రి పుర సాంస్కృతిక సంస్థలు - 10-05-2010

  4. అజో-విభో-కందాళం విశిష్టసాహితీమూర్తి పురస్కారం - బాపట్ల - 11-06-2011

  5. కడప జానమద్ది సాహితీ పీఠ ప్రథమ పురస్కారం 21-10-2012

  6. పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం – హైదరాబాదు – 2012

  7. శ్రీ రాయసం సుబ్బారాయుడు స్మారక పురస్కారం, హైదరాబాదు - 21-05-2013


  8. హైదరాబాద్‌ భక్తి టి.వి. వారి పురస్కారం - నవంబర్‌, 2013

  9. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం - హైదరాబాద్ - 2013

  10. శ్రీ కాళ్ళకూరి సుబ్బారావుగారి తృతీయ స్మారక పురస్కారం - 2012, గణపవరం‌ - 27-12-2013

  11. శ్రీ లలితాపీఠము - శ్రీశ్రీశ్రీ దక్షిణామూర్తి పరమహంస పురస్కారము - విశాఖపట్టణం - 2014 - 13-02-2014

  12. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి ఋషిపీఠ పురస్కారము - హైదరాబాద్‌ - 15-03-2014

  13. శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారి స్మారక పురస్కారం - విశాఖపట్టణం - 8-4-2014

బిరుదప్రదానాలు


    శ్రీకంచికామకోటిపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీస్వామివారు, శ్రీవారి 75వ జన్మదిన సందర్భంగా తిరుపతిలో “లేఖారత్న” బిరుదాన్ని అనుగ్రహించారు - 17-06-2010


2015 ~ 2019

రచనలు


  1. ఆదిత్యహృదయ హృదయం – 2015 – రామాయణాంతర్గత ఆదిత్యహృదయానికి వ్యాఖ్యానం.

  2. స్ఫురణాదీపకళికలు – వ్యాసకుసుమమాల – 182 పేజీలు

  3. మహాభారతం – అనుశాసన నుండి స్వర్గారోహణపర్వం వరకూ - నీలకంఠీయ వ్యాఖ్యాసహితం – 2015

  4. కల్పవృక్షవాగ్వైభవం – వ్యాససంపుటి 2016

  5. పంచామృతరసవాహిని (వెనుక వ్రాసిన కొన్ని స్తోత్రాల వ్యాఖ్యానాలతో కూర్చిన గ్రంథం) 2016 – 144 పేజీలు

  6. భాగవతం – ఆణిముత్యాలు – పోతన భాగవతములోని 324 పద్యాలకు సందర్భ, తాత్పర్య రచనల కూర్పు. (అమెరికాలో ఉన్న శ్రీ పుచ్చా మల్లిక్ గారి ప్రణాళిక) – 2016 – 195 పేజీలు

  7. ఉత్తరగీతాసౌరభము – 2016 – 86 పేజీలు

  8. పోతన భాగవతం – చతుర్థస్కంధంలోని పురంజనోపాఖ్యానానికి వ్యాఖ్యానం – 2016

  9. మహాభారత సందేశము – పీఠిక – న్యాయమూర్తి పమిడిఘంటం కోదండరామయ్య గారి ఆంగ్ల రచనకు తెలుగు రచన – 2018 – 60 పేజీలు

  10. యామునప్రభు రాజనీతి – ఆముక్తమాల్యద పద్యాలకు వ్యాఖ్యానం – 2019

  11. శరశర్మజీవవేదన – కందపద్యాలు - 2019 – 32 పేజీలు

  12. రథసప్తమీ సమర్చన – 2019 – 40 పేజీలు

  13. భారతారణ్యపర్వము1-165 అధ్యాయాలు (శ్లోకతాత్పర్య నీలకంఠీయవ్యాఖ్యానాలతో) – 1300 పేజీలు

  14. మహాభారతము – సభాపర్వము (శ్లోకతాత్పర్య నీలకంఠీయవ్యాఖ్యానానువాదము లతో) – 770 పేజీలు

  15. గురువందనం – 2019

పురస్కారాలు


  1. శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారి పురస్కారం – 15.3.2015 – విశాఖపట్టణం

  2. కృష్ణాజిల్లా ఉయ్యూరు సరసభారతి ఉగాది పురస్కారం – 15.3.2015

  3. శ్రీమాన్ డా. న.చ.రఘునాథాచార్యస్వామివారి 90వ తిరునక్షత్రోత్సవపురస్కారం – మే 2015

  4. నరసరావుపేట శ్రీవ్యాసపీఠపురస్కారం – జూలై 2015

  5. శ్రీమండలి కృష్ణారావు స్మారకపురస్కారం కృష్ణాజిల్లా రచయితల సంఘం – సెప్టెంబరు 2017

  6. అభినవభోజశ్రీదంటు భాస్కరరావు స్మారక పురస్కారం – ఛాంబర్ ఆఫ్ కామర్స్ – కాకినాడ – అక్టోబర్ – 2017

  7. “మహామహోపాధ్యాయ” పురస్కారం – రాష్ట్రీయసంస్కృతవిద్యాపీఠం – తిరుపతి – 2018.

  8. “భారత రాష్ట్రపతి పురస్కారం” 2016. న్యూఢిల్లీ – 4.4.2019.

  9. అనంతపురం పూర్వవిద్యార్థుల సత్కారం – 7-8-2019, అనంతపురం

  10. ఆచార్య జీవియస్ పురస్కారం – 14.9.2019. హైదరాబాదు

బిరుదప్రదానాలు


  1. నరసరావుపేట వ్యాసపీఠంవారు 2016 లో “భారత సంహితా వాచస్పతి” బిరుదప్రదానం చేశారు

  2. విజయనగరకౌముదీపరిషత్పురస్కారం “విద్యావాచస్పతి” బిరుదప్రదానం 2017

  3. రాష్ట్రీయసంస్కృతవిద్యాపీఠంవారు “మహామహోపాధ్యాయ” బిరుదం ప్రదానం చేశారు. 2018.

  4. “ధర్మశాస్త్రవిద్వన్మణి” శ్రీకామేశ్వరీ వైదిక విజ్ఞాన పరిషత్తు, మరియు శ్రీరామానుజ విశిష్టాద్వైత వేదాంత పరిషత్తు, హైదరాబాదు సంయుక్తంగా సమర్పించిన బిరుదము. 2019

ఉత్తమవిద్వత్సమారాధన


  1. 2016 లో బ్రహ్మశ్రీ వేదమూర్తులు జటావల్లభుల జగన్నాధం గారికి, (కైకవరం)

  2. 2017 లో శ్రీమాన్ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామివారికి, (వరంగల్)

  3. 2018 లో బ్రహ్మశ్రీ వేదమూర్తులు పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారికి, (భాగ్యనగరం)

  4. 2019 లో బ్రహ్మశ్రీ వేదమూర్తులు డా. అమరేశం రాజేశ్వరశర్మగారికి (భాగ్యనగరం)

అన్నజ్ఞానసమారాధన


    శరశర్మదంపతులు 2016 నుండి అన్నజ్ఞానసమారాధన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు


2020 ~ 2024

రచనలు


  1. తైత్తిరీయ విద్యాసౌరభం -2020 -263 పేజీలు

  2. గురువందనం – 2020 – 139 పేజీలు

  3. చారుచర్యగోరుముద్దలు – 45 లఘువ్యాసములు - 2020

  4. గీతామృతం గోరుముద్దలు – 400 పుటలు 2020

పురస్కారాలు


  1. రాజమహేంద్రవరం – పురపాలకసంస్థ – పౌరసమ్మానం.

  2. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీర్థ మహాస్వామివారి సప్తతిపూర్తి సందర్భంగా శృంగేరీ శారదా పీఠం అనుగ్రహించిన శ్రీ భారతీతీర్థ పురస్కారం

  3. వెదురుపాక విజయదుర్గాపీఠం - గాడ్ గారి - జీవనసాఫల్యపురస్కారం.

ఉత్తమవిద్వత్సమారాధన


  1. 2020లో బ్రహ్మశ్రీ వేదమూర్తులు డా. జోశ్యుల సూర్యప్రకాశరావుగారికి (రాజమహేంద్రవరం)

  2. 2021లో బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ పోతుకూచి సూర్యనారాయణ గారికి (రాజమహేంద్రవరం)